epaper
Tuesday, April 7, 2026
epaper

బాసర ఆలయానికి మహర్దశ

బాసర ఆలయానికి మహర్దశ
శృంగేరి పీఠం నుంచి అనుమ‌తులు
వారి సూచ‌న‌ల‌కు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్
33 అడుగుల వెడ‌ల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు
20 వేల చ‌ద‌ర‌పు అడుగుల నుంచి 62 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు ఆల‌య విస్తీర్ణం
6 వేల మంది భ‌క్తులకు ఫీడింగ్ రూమ్‌, ఫుడ్ స్టాల్స్‌, శౌచాలయాలు
70 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌తో క్యూ కాంప్లెక్స్‌ల నిర్మాణం
రూ.225 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : నిర్మల్‌ జిల్లా బాసరలోని స‌రస్వ‌తీదేవి ఆల‌యానికి మ‌హ‌ర్ధ‌శ ప‌ట్టింది. రూ. 225 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారు. ప్ర‌స్తుతం ఉన్న ఆల‌య విస్తీర్ణాన్ని 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల నుంచి 62 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు విస్తరించనున్నారు. ఆల‌యంలో ప్రతి నిర్మాణంలో అద్భుత శైలిని కలిగిన శిల‌ల‌ను ఉపయోగించనున్నారు. 6 వేల మంది భ‌క్తులకు ఫీడింగ్ రూమ్‌, ఫుడ్ స్టాల్స్‌, శౌచాలయాలు తదితర వసతులతో 70 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌తో క్యూ కాంప్లెక్స్‌లు నిర్మాణం చేస్తారు. 200 మంది ఏక‌కాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా పెద్ద మందిరం, 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంతో వంటశాల‌, భోజ‌న శాల‌లు, ప్రసాద విక్రయ కౌంటర్లు సహా ఈశాన్య దిక్కున మంచినీటి కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మిక‌త ప‌రిఢ‌విల్లేలా తోర‌ణాలు, స‌మాచార కేంద్రం, దేవాల‌యానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో విశాలమైన రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. అభివృద్ది ప‌నుల‌తో బాసర ఆల‌య రూపురేఖ‌లు పూర్తిగా మార‌నున్నాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెప్తున్నాయి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మాస్టర్​ ప్లాన్​ను రూపొందించిన అధికారులు

బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయ విస్తరణ పనులను చేసేందుకు అధికారులు రూ.225 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. ఈ ప్లాన్‌లో ఆలయ పునరాభివృద్ధి నమూనాలోని ఒక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారమే విడుదల చేసింది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి గ‌ర్భాల‌యం, అర్ధ మండ‌పం, రాజ గోపురం, ఇత‌ర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల అభివృద్ధి నిర్మాణాల‌కు సంబంధించి అనుమ‌తులను శృంగేరి పీఠం నుంచి తీసుకున్నారు. వారి సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌ను అధికారులు రూపొందించారు. ప్రస్తుతం 2 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉన్న గ‌ర్భాల‌యం, అర్ధ మండ‌పాన్ని 5 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు విస్తరించనున్నారు. ఉత్తరం వైపు 9 అంత‌స్తుల రాజ‌గోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడ‌ల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారాలను అభివృద్ధి చేయనున్నారు.

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీ బిజీ..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల పర్యటిస్తున్నారు. బజార్‌హత్నూర్‌ మండలం పిప్రిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌కు 3 ఏళ్లు పూర్తైన సందర్భంగా సభ నిర్వహస్తిన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జైనథ్‌లో రూ.20 కోట్లతో నిర్మించిన గురుకుల పాఠశాల బాలుర భవనం, ఆదిలాబాద్‌లో మైనారిటీ గురుకుల బాలికల విద్యాలయం, సిరికొండ నుంచి ఇంద్రవెల్లి వరకు నిర్మించిన లాంగ్ స్వాన్‌ బ్రిడ్జిలను ప్రారంభోత్సవం చేశారు. పిప్పిరి ఎత్తిపోతల పథకం, తేజపూర్ ఎత్తిపోతల పథకం, బుగ్గారం ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం లాండసాంగి చెక్‌డ్యాం, బోథ్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనం, పొచ్చరలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం, నాగోబా ఆలయ సుందరీకరణ అభివృద్ధి పనులకు రూ.20.40 కోట్లు, లక్కారంలో ఐటీడీఏ ఉట్నూర్ నూతన భవన నిర్మాణం, ఇచ్చోడ నుంచి డెడ్రా వరకు రూ.30 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! మారీచులపై టీజీఎండీసీ ఎండీ స్పంద‌న‌ బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి క్వారీ-2 అక్ర‌మాల‌పై ఎంక్వ‌యిరీకి భ‌వేశ్‌మిశ్రా...

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు శంషాబాద్ టు కిమ్స్ ఆసుపత్రి గ్రీన్ ఛానెల్ ద్వారా...

బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి

బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి అభివృద్ది ప‌నుల్లో రాజీ ప‌డొద్దు టీటీడీ త‌ర‌హాలో ఏర్పాట్లు...

లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర

లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర యువతకు ఉద్యోగాలు దక్కకుండా ప్రభుత్వం అడ్డంకులు తమవారికే కొలువులు...

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం హ్యామ్ మోడల్ రోడ్లకు రూ. 13 వేల...

సీఐడీ ఎంక్వైరీతో లాభ‌మేంటి?

సీఐడీ ఎంక్వైరీతో లాభ‌మేంటి? మంత్రిని అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుందా? పొంగులేటి మంత్రి పదవికి...

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన క‌లిగి ఉండాలి

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన క‌లిగి ఉండాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సామాజిక సేవ...

ఆత్మీయ అనుబంధాలు మాయం

ఆత్మీయ అనుబంధాలు మాయం మనుషుల మధ్య పెరుగుతున్న వైష‌మ్యాలు ప్రేమానురాగాల కంటే సంపాదనపైనే మోజు ఉమ్మ‌డి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img