వైభవంగా మహాపడి పూజోత్సవం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఖిలావరంగల్ పెట్రోల్ పంపుకు చెందిన మకరజ్యోతి కుటుంబం గురుస్వామి తోటకూరి రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా మహాపడి పూజోత్సవం నిర్వహించబడింది. ఈ పూజలో సుమారు 500 మంది మాలదీక్ష అయ్యప్ప భక్తులు పాల్గొని భక్తి భావనతో పూజల్లో పాల్గొన్నారు. గురుస్వామి ఆహ్వానం మేరకు వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంటా రవికుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ప్రముఖ వ్యాపారవేత్త గజ్జెల రామకృష్ణ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వారు వేదబ్రాహ్మణులచే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఖిలావరంగల్ పెట్రోల్ పంపు మరియు విద్యానగర్ కాలనీలో నామస్మరణతో, భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. మహాపడి పూజోత్సవం నగరంలో ఆధ్యాత్మిక వైభవానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.



