epaper
Saturday, March 7, 2026
epaper

“మహానటి”

“మహానటి”
**
ఆమె ఒక గొప్ప నటి…
ఎందుకంటే ఆమె నటన
ప్రాణాలతో రాసిన నాటకం
ఆస్కార్ అవార్డ్స్
ఎన్ని ఇచ్చినా సరే,
ఆమె నటన ముందు అవన్నీ దిగదుడుపే .
మనసులో అగ్నిపర్వతాలు బద్ధలవుతున్నా…
బయటకి మంచుకొండలా నిలబడుతుంది.
“నేను బానే ఉన్నా…” అనే మాట
ఆమె జీవితంలోనే
అత్యంత పెద్ద అబద్ధం.
కాగితపు నవ్వు పులుముకుని
సమాజపు వేదికనెక్కుతుంది.
సభల్లో ఆమె స్వరం గర్జిస్తుంది —
స్త్రీ సాధికారత,
ఆత్మగౌరవం,
ఆత్మవిశ్వాసం గురించి.
ఆమె చెరగని మందస్మితం వెనుక
అణచివేతకు గురైన ఆర్తనాదాల ప్రతిధ్వనులు,
ఆమె ఆత్మగౌరవ గాయాలపై
కప్పిన సిల్కు చీరల మెరుపులు.
ఇల్లు చేరి తలుపులు మూసుకున్న మరుక్షణం…
బాధ రెండు అర్ణవాలైన కళ్ళలోనుండి
జలపాతాలై జారిపడుతుంది…
ఆమె వేదనకు నాలుగు గోడలే సాక్షులు…
బాధను పంటిబిగువున దిగమింగిన నిశ్శబ్దమే ఆమె అనంత ఆత్మకథ.
బయట ప్రపంచానికి ఆమె ఒక సాధికార మహిళ—
సభల్లో మాటల స్పూర్తితో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపే
మోటివేషనల్ స్పీకర్.
కానీ ఇంట్లో వారికి మాత్రం
తెలివి లేని తరుణి అనే ముద్ర.
ఆమె ఎన్ని పట్టాలు పుచ్చుకున్నా
అవి తలుపు దగ్గరే గోడలకో, షో కేసుల్లోనో వేలాడుతాయి;
కానీ ఆమెకు ఇంట్లో కాళ్ళు తుడుచుకునే పట్టా విలువ కూడా దక్కదు .
ఇంట్లో వాళ్ళ మాటలతో అను నిత్యం చస్తూ,…
సమాజం ఇచ్చే గౌరవంతో ప్రతిరోజూ ఊపిరి పోసుకుని బ్రతుకుతూ,
మేకపోతు గాంభీర్యం నటిస్తూ
సమాజం ఇచ్చే చప్పట్ల దుప్పట్లతో
గాయాల్ని కప్పేసుకుంటుంది..బతుకీడుస్తుంది …. మీరనుకునే
సగటు “ఎంపవర్డ్” స్త్రీ.
ఆమె మహానటి కాదు —
ఆమె ప్రతి రోజు
తన బాధను చంపి
తనను తాను బ్రతికించుకునే
అగ్నిపర్వతం ….!
“ఆమెకేమైంది?
రెండు చేతులా సంపాదిస్తోంది కదా!”
అని వెకిలిగా నవ్వే ముందు
ఆమె గుండె సడి వినండి…
ఆమె కూడా మీలాగే రక్తమాంసాల ఆడదే —మెషినరీ కాదు…
తను కూడా గౌరవం ,
గుర్తింపు కోసం కాదు,
ఒక చిన్న ఆదరణ కోసం
ఎదురుచూస్తున్న సాటి మనిషే.

ఇంత బాధను భరిస్తూ నవ్వును పెదాలకు కుట్టుకుని ఈ జీవిత నాటకరంగం పై
విభిన్న పాత్రలు సక్సెస్ఫుల్ గా పోషిస్తున్న ఆమె మహానటి కాదు…
ఆమె ఒక మౌన విప్లవం.
ఆమె జీవితం —
రక్తంతో రాసిన కవిత.
……
కళ్యాణి తురుమెళ్ళ
కవయిత్రి, రచయిత్రి, ప్రభుత్వఉపాధ్యాయిని
(ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా)

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భూదాన్ భూముల పేరిట మోసం

భూదాన్ భూముల పేరిట మోసం అక్రమ వసూళ్లపై 6 మందిపై కేసు సత్తుపల్లి ఇన్స్పెక్టర్...

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహాయ ఉపకరణాలు, సబ్సిడీల...

సమాజ అభివృద్ధికి మహిళలే బలం

సమాజ అభివృద్ధికి మహిళలే బలం జిల్లా కలెక్టర్ అంకిత్ ఘనంగా అంతర్జాతీయ మహిళా...

భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా

భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా కమిటీ సభ్యులమంటూ నిరుపేదల నుంచి రూ.3...

హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు

హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని నెహ్రూ...

సీఐటీయూలో చేరిన యువ కార్మికులు

సీఐటీయూలో చేరిన యువ కార్మికులు కాకతీయ, కొత్తగూడెం : కార్మికుల సమస్యల పరిష్కారం...

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాకతీయ, కొత్తగూడెం :జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి...

పెళ్లిరోజే విషాదం… రైల్వే ఉద్యోగి మృతి

పెళ్లిరోజే విషాదం… రైల్వే ఉద్యోగి మృతి విద్యుత్ షాక్‌కు గురై నవీన్ మృతి మణుగూరు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img