epaper
Monday, March 2, 2026
epaper

మహాలక్ష్మి పథకం గ్రాండ్ సక్సెస్

మహాలక్ష్మి పథకం గ్రాండ్ సక్సెస్
200 కోట్ల మంది ఉచిత ప్రయాణం
6680 కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న మహిళలు
హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా లోకం

కాక‌తీయ‌, యాద‌గిరిగుట్ట : మహాలక్ష్మి పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణం పథకం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు . దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ పథకం ఉత్సవాలు నిర్వహించుకుంటుంది. ఈ పథకం పట్ల మహిళా లోకం పూర్తి సంతృప్తిని హర్షాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ రోజు వరకు 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. తద్వారా 6680 కోట్ల రూపాయల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్నారు.

ప్రస్తుతం ఏ బస్సులో చూసినా మహిళా ప్రయాణికులే అత్యధికంగా కనిపిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పథకం జనాకర్షక పధకంగా కనిపిస్తున్నప్పటికీ, మహిళా సాధికారతకు ఎంతగానో తోడ్పడుతోంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ పథకం ఆదర్శంగా మారుతుంది. కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ఎన్ని రోజులు మోస్తారు …ఏదో ఒక రోజు ఈ పథకానికి స్వస్తి పలుకుతారు…. అని విమర్శలు గుప్పించిన వారి నోళ్లకు తాళాలు పడ్డాయి. రోజురోజుకు ఇనుమడించిన ఉత్సాహంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ఈ పథకాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భేష్ అనిపించుకుంటుంది. మహిళా లోకం అభిమానాన్ని ఈ పథకం చూరగుంది. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట డిపో యాదాద్రి బస్ స్టేషన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు .ఏసిపి శ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయగా ,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పావని, అలాగే జిల్లా పరిషత్ బాలికలు పాల్గొన్నారు .ప్రతిరోజు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలకు బహుమతులే కాకుండా శాలువాలతో సత్కరించారు .జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు ఏసిపి శ్రీనివాస్ నాయుడు తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సిహెచ్ మురళీకృష్ణ ,అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ ,గ్యారేజ్ ఇంచార్జ్ హనుమాన్ నాయక్, ముత్యాలు, మనోజ్ కుమార్ తో పాటు డిపో సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రామ సౌభాగ్యం – బీజేపీతోనే సాధ్యం

గ్రామ సౌభాగ్యం - బీజేపీతోనే సాధ్యం రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీ...

నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం

నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు, రేవంత్...

రేవంత్ బెస్ట్ యాక్ట‌ర్‌

రేవంత్ బెస్ట్ యాక్ట‌ర్‌ ఆయ‌న‌కు భాస్క‌ర అవార్డు ఇవ్వాలి బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్‌వ‌న్నీ నాట‌కాలే బీసీ...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

అబద్దాల పాల‌న‌లో కాంగ్రెస్‌

అబద్దాల పాల‌న‌లో కాంగ్రెస్‌ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపెట్టేందుకు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్...

యూరియా రైతులకు సమృద్ధిగా అందాలి

యూరియా రైతులకు సమృద్ధిగా అందాలి నిర్ధేశించుకున్న ఆయిల్ ఫామ్ లక్ష్యాలను అధిగమించాలి అధికారులను ఆదేశించిన...

కొత్త రేషన్ కార్డులతో పేదల జీవితాల్లో సంతోషం : ఎమ్మెల్యే డా మురళీ నాయక్

కొత్త రేషన్ కార్డులతో పేదల జీవితాల్లో సంతోషం : ఎమ్మెల్యే డా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img