మార్కండేయ ఆలయంలో మహా అన్నదానం
నాగయ్య శాస్త్రి మంత్రోచ్ఛరణ లతో ప్రత్యేక పూజలు
కాకతీయ,నెల్లికుదురు: మండలంలోని శ్రీ శివ పార్వతీ సహిత భక్త మార్కండేయ స్వామి ఆలయం లలో ఆలయ అర్చకులు వెలుకూచి నాగయ్య శాస్త్రి వేద మంత్రోచ్ఛరణల లతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహానప్రసాద వితరణ నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.అంతకు ముందు భక్తులు స్వామి వారిని దర్శించుకొని.పూజా ద్రవ్యాలు సమర్పించుకొని భగవత్కృపకు పాత్రులయ్యారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూరపాటి వెంకటేశ్వర్లు,వేముల సుధాకర్, పాము రవీందర్, వెంకటనారాయణ,
పాము ఉపేందర్, బేతు ఎల్లయ్య,
మామిడాల సత్యనారాయణ,
వేముల శ్రీనివాస్,డా.రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


