కాకతీయ, ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదివారం మార్కెట్ యార్డులో మాదిగ కులస్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఇచ్చోడ మాదిగ కుల సంఘం కాలనీ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దుబ్బాక అశోక్, ఉపాధ్యక్షుడు అన్నెల లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి కొల్లూరి సంతోష్, కోశాధికారిగా సిరిసిల్ల భూమయ్య, కార్యదర్శులుగా జల్లి దుర్గయ్య, కొత్తూరి లక్ష్మణ్, సహాయ కార్యదర్శులుగా మచ్చ, అజయ్, కాశిపాక, విష్ణును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సభ్యులు దేవునిరి, ఆడేళ్లు, ముడుగు శివ, రాజు, ముడుగు శీను, చింటు, అరపెల్లి రవి, చిట్టి రవి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు దుబ్బాక అశోక్ మాట్లాడుతూ తమ ఉనికిని చాటాలని, తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తానని, మాదిగ సంక్షేమ సంఘం అభ్యున్నతి కోసం నిస్వార్ధంగా కృషి చేస్తానని తెలిపారు.


