epaper
Sunday, March 1, 2026
epaper

Govt Teacher: ప్రభుత్వ ఉద్యోగం కోసం 3 రోజుల పసికందును పాతిపెట్టిన తల్లిదండ్రులు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా నందనవాడీ గ్రామంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగ భయంతో ఓ టీచర్, తన భార్యతో కలిసి నాలుగో సంతానం పసికందును బండరాయి కింద పాతిపెట్టారు. ఈ ఘటన గత నెల 28వ తేదీ తెల్లవారుజామున శిశువు ఏడుపుతో బయటకు వచ్చింది. మార్నింగ్ వాకర్స్ శిశువు ఏడుపును విన్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుక్కపట్టి ఏడుస్తున్న మూడు రోజుల వయస్సు కలిగిన పసికందును బండరాయి కింద చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు.

పోలీసులు పసికందును చేరదీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శిశువు తల్లిదండ్రులను పోలీసులు గుర్లించారు. దంపతుల పేర్లు బాబూ దండోలియా (38) రాజకుమారి అని పేర్కొన్నారు. విచారణలో వారు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారని, తాము నందనవాడీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఏ ఉద్యోగికి ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదని తెలుసుకున్న భయంతో, నాలుగో సంతానం పసికందును బండరాయి కింద పాతిపెట్టినట్లు వారు తెలిపారు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, శిశువు, తల్లిదండ్రుల డీఎన్ఏ నమూనాలను పరీక్షకు పంపించారు. రిపోర్టు రాగానే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యులు వెల్లడించిన ప్రకారం, శిశువు శరీరంపై గాయాలు, చీమల దాడులు ఉండగా, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల విషయంపై స్పష్టత వచ్చే వరకు శిశువును ప్రభుత్వ సంరక్షణలోని శిశు గృహంలో ఉంచారు.

జిల్లా విద్యాశాఖ అధికారి గోపాల్ సింగ్ బఘేల్ తెలిపినట్లుగా, 2001 జనవరి 26 తర్వాత మూడో సంతానం పుట్టితే ఉద్యోగం తొలగించేలా మధ్యప్రదేశ్ విద్యాశాఖలో నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలను జనాభా నియంత్రణకు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే కొంతమంది కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నారని కూడా తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img