ఎల్ఆర్ఎస్ దరకాస్తులను త్వరగా మంజూరు చేయాలి
నగరంలో అనధికారిక లే ఔట్ లను గుర్తించండి
నగర మేయర్ గుండు సుధారాణి
టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం
కాకతీయ, వరంగల్ : పెండింగ్ లో ఉన్న ఎల్ ఆర్ ఎస్ దరకాస్తులను వెంటనే మంజూరు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగానగరం లో అనధికారిక లే ఔట్ లను గుర్తించాలని అన్నారు.
గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాలులో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మేయర్ పాల్గొని మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ కు చెందిన ఎల్ 1 లాగిన్ లో 15 వేలు, ఎల్ 2 లాగిన్ లో 2 వేల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇరిగేషన్, రెవిన్యూ శాఖలతో లింక్ అయి ఉన్న దరఖాస్తులు కాకుండా మిగతా దరఖాస్తులు పరిష్కరించాలని అన్నారు.
అనంతరం ఇరిగేషన్ రెవిన్యూ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పెండింగ్ లో ఉన్న దరకాస్తుల ను త్వరితగతిన మంజూరు ఇవ్వాలని అన్నారు. బల్దియా కు సంబంధించిన సుమారు 11 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని నెల రోజు లోగా పరిష్కరించాలని అన్నారు. నగర పరిధిలో అనథరైజ్డ్ లే ఔట్ లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చైన్ మెన్ లు క్షేత్ర స్థాయిలో ప్రతిరోజు చైన్ మెన్ లతో సహా టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి గుర్తించి సమాచారం అందజేసి టిపి ఆర్ నోటీసులు అందజేసి తొలగింపు చేపట్టాలని మేయర్ అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీంద్ర డీ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్నరాణి, రవీందర్, ఏసిపిలు ఖలీల్, రజిత, ప్రశాంత్, టిపిఎస్ లు, టిపిబిఓలు, చైన్ మెన్ లు తదితరులు పాల్గొన్నారు.


