లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత..
4000 క్యూసెక్కుల నీటి విడుదల.
కాకతీయ,కరీంనగర్ : లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం డ్యామ్ స్పిల్‌వే గేట్లు ఎత్తి సుమారు 4000 క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి విడుదల చేసినట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.ప్రాజెక్టు దిగువన మానేరు నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది దాటే ప్రయత్నాలు చేయవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే పశువుల కాపర్లు, గొర్రెల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సాధారణ ప్రజలు నది తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.మానేరు నదిలో వరద ప్రవాహం కొనసాగినంత వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.


