జాతీయ రహదారిపై లారీ బోల్తా
కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోహన్‌రావుపేట సమీపంలో జాతీయ రహదారిపై కట్టెల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడింది. ప్రమాదంతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని రాకపోకలను నియంత్రించారు. జే.సి.బి యంత్రాల సహాయంతో బోల్తాపడ్డ లారీని పైకి లేపి రహదారి పక్కకు తరలించారు. దీంతో ట్రాఫిక్‌ను సజావుగా పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


