కాకతీయ, రాయపర్తి/ వర్ధన్నపేట : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు రాయపర్తి మండలానికి చెందిన దూడయ్య, నాగుల సాయిలు ద్విచక్ర వాహనంపై రామారం వెళుతున్నారు.
కాగా ఖమ్మం నుండి వరంగల్ వైపు వెళ్తున్న లారీ యూటర్న్ తీసుకుంటున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.


