కాకతీయ, ఇనుగుర్తి : మండలంలోని ఇనుగుర్తి, చిన్ననాగారం, కోమటిపల్లి, చిన్న ముప్పారం తదితర వివిధ గ్రామాలలో వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం మహిళలు భజన బృందాలతో కోలాటాలతో బ్యాండ్, డిజె పాటలతో సాగింది.
చిన్నాపెద్ద అంతా కలిసి శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొని ఆడి పాడారు. చివరి రోజు కావడంతో గణనాథునికి వేద బ్రాహ్మణులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేశారు.


