కాకతీయ, బయ్యారం: మండల కేంద్రంలోని రామచంద్రపురం వెళ్లే ప్రధాన రహదారి బండ్లమాంబ గుడి సమీపంలో రోడ్డు అద్వాన స్థితికి చేరి పట్టించుకునే నాధుడు కరువయ్యారని, అటువైపు వెళ్లే వాహనదారులు అబ్బే..ఇది రోడ్డేనా..? అని ముచ్చటించుకుంటున్నారు. బుధవారం కాలనీలోని స్థానికులు అనేక సార్లు అధికారులకు పిర్యాదు చేసినా.. రోడ్డు మరమ్మత్తులు చేయక పోవడంతో, రోడ్డుకు అడ్డంగా కట్టెలు వేసి, బురద రోడ్డుపై నాట్లు వేసి ,తమ నిరసన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపతి, సంఘటనా, స్థలానికి చేరుకొని ,నిరసన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు, అధికారుల పని తీరుపై మండి పడ్డారు.ఈ విషయంపై నచ్చజెప్పి, రోడ్డు మరమ్మతులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా కృషి చేస్తామని హామి ఇచ్చారు . ,గ్రామ కార్యదర్శి, శ్రీధర్ ,ఇతర ఆర్ అండ్ బి అధికారులతో ఎస్సై ఫోన్లో సంభాషించినట్లు సమాచారం.


