కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ గెజిట్ విడుదల చేసింది. రిటర్నింగ్ అధికారులు మొదటి విడత నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్లు ఈ నెల 11 వరకు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన 12 తేదీ, ఉపసంహరణకు గడువు 15 తేదీ వరకు ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్‌లో 292 జెడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరుగుతుంది.
నామినేషన్ దాఖలుకు కావలసిన పత్రాలు, అర్హతలు:
*అభ్యర్థి వయస్సు కనీసం 21 ఏళ్లు ఉండాలి.
*సంబంధిత ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు చేయబడాలి.
*ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కాస్ట్ సర్టిఫికెట్ జత చేయాలి.
*డిపాజిట్ సొమ్ము చెల్లించాలి.
*క్రిమినల్ హిస్టరీ, స్థిర ఆస్తులు, విద్యార్హతలను అఫిడవిట్‌లో పేర్కొని, కనీసం ఇద్దరు సాక్షులతో సంతకం చేయించాలి.
*ఎలక్షన్ ఖర్చులను నిర్వహిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి.
*ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో నామినేషన్‌లో స్పష్టంగా చూపించాలి. లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా గుర్తింపు లభిస్తుంది.
*నామినేషన్ పత్రంలో అనేక పార్టీ పేర్లను పేర్కొనవచ్చు. కానీ బీ ఫారం అందించకపోతే స్వతంత్ర గుర్తింపు.
*ఒక్కే స్థానంలో పోటీ చేసే అభ్యర్థి ఆ స్థానంలోని ఓటరు మాత్రమే ప్రతిపాదకుడిగా ఉండాలి.
నామినేషన్ పత్రంలో సంతకాల విధానం:
Part 1: ప్రతిపాదకుడి సంతకం
Part 2: అభ్యర్థి సంతకం
Part 3: అభ్యర్థి సంతకం
Part 4: రిటర్నింగ్ అధికారిక (RO) సంతకం
Part 5: రిజెక్ట్ చేసిన నామినేషన్ల కారణాలు – RO సంతకం
Part 6: రిఫ్రెస్ట్ లిస్టులో RO సంతకం
అఫిడవిట్: రెండు సాక్షుల సంతకాలు + అభ్యర్థి సంతకం
ఎక్స్‌పెండిచర్ డిక్లరేషన్: అభ్యర్థి సంతకం
ఈ నోటిఫికేషన్ ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రాసెస్ పూర్తిగా ప్రారంభమైంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఆడిట్ కమిటీలు నిబంధనలు పాటిస్తూ నామినేషన్లను సమర్పించవలసి ఉంటుంది.


