కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ రచయిత సాహిత్య విమర్శకులు ఆచార్య ఎస్వీ రామారావు గారి మరణం సాహిత్య రంగానికి తీరని లోటు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎస్వీ రామారావు గారి మృతికి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు
మహబూబ్ నగర్ జిల్లా శ్రీరంగాపూర్ గ్రామంలో జన్మించిన ఆచార్య ఎస్వీ రామారావు గారు పరిశోధకునిగా, రచయితగా, విమర్శకునిగా, పరిశోధనలకు మార్గదర్శకునిగా అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 19 పీహెచ్ డీ, 15 ఎం.ఫిల్ పరిశోధనలకు మార్గనిర్దేశం చేసిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ గా, సెంట్రల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ వంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల విజిటింగ్ ప్రొఫెసర్ గా ఎందరో పరిశోధనా విద్యార్థులను తీర్చిదిద్దారని గుర్తు చేశారు
పాఠ్య గ్రంథాల రూపకల్పనలో, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో చెరగని ముద్ర వేసిన ఎస్వీ రామారావు గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ఈ విపత్కర సమయాన్ని అధిగమించే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు.


