కాకతీయ, నర్మెట్ట : ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మండలంలోని మాన్ సింగ్ తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్షరాస్యత ప్రతిజ్ఞ చేసి, ప్రతి ఒక్కరూ చదువులో ముందంజ వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పగిడిపల్లి దామోదర్, ఉపాధ్యాయులు రావుల రామ్మోహన్ రెడ్డి, అంగన్‌వాడీ టీచర్ లక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.


