కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ రామంతాపూర్‌లో స్పూరి కళాశాల వద్ద మద్యం లోడ్‌తో వెళ్తున్న ఓ లారీకి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే అగ్నికీలలు వ్యాపించడంతో లిక్కర్ కార్టూన్లు కాలిపోయి బూడిదయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, లారీ పక్కన పడివున్న మద్యం సీసాలను చూసి స్థానికులు ఎగబడి వాటిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


