- ఎక్సైజ్ సీఐ చిరంజీవి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వైన్ షాప్ టెండర్ కు 21 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 34 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పట్టణం లో 34 దరఖాస్తులు, జిల్లాలో 57 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. సోమవారం నుంచి పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొంత మందకొడిగా దరఖాస్తులు వస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉండటంతో ఒక్కసారిగా టెండర్ దరఖాస్తులు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీ ఎస్ఐలు అశోక్ కుమార్, మౌనిక, కానిస్టేబుల్ శ్రీనివాస్, యాదగిరి, భవాని తదితరులు పాల్గొన్నారు.


