నకిలీ లిక్కర్ తయారీ గుట్టురట్టు
ప్రముఖ మద్యం కంపెనీల పేర్ల లేబుళ్లు అంటించి మార్కెట్లో విక్రయాలు

కాకతీయ, హైదరాబాద్ : రైస్ మిల్లులో స్పిరిట్‌తో నకిలీ లిక్కర్ తయారీ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లోని కృష్ణపద్మ స్పిరిట్ కంపెనీలో రైస్ మిల్లులో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ డీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో భారీగా కల్తీ లిక్కర్, తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. తోట శివకుమార్, మల్లికార్జున్‌లను అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ మద్యం తయారు చేసి ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు వేస్తున్నట్లు గుర్తించారు.


