epaper
Thursday, March 26, 2026
epaper

మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి

మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి
మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జ‌ర‌గాలి
అకాల వర్షాల నష్టానికి పరిహారం చెల్లించాలి
దళారుల దోపిడీతో తీవ్ర న‌ష్టాల్లో రైతులు
సీపీఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు

కాకతీయ, బోనకల్ : ఎకరానికి 25 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించడం దారుణమని, వెంటనే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు రక్తాన్ని శ్రమగా మార్చి పంటలు పండిస్తున్నారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండల కేంద్రంలో సీపీఐ ఎం తెలంగాణ రైతు సంఘం మండల కమిటీల ఆధ్వర్యంలో రైతు సమస్యలపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సిఐటియు కార్యాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం ఖమ్మం బస్టాండ్ సెంటర్ మీదుగా ప్రదర్శనగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రాన్ని తహశీల్దార్ మద్దెల రమాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఎకరానికి సుమారు 40 క్వింటాల దిగుబడి వస్తున్నా కేవలం 25 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులను నష్టాల్లోకి నెడుతోందన్నారు. మిగిలిన పంటను ఎవరు కొనుగోలు చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

దళారుల దోపిడీ పెరుగుతోంది

మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులు గ్రామాల్లోకి ప్రవేశించి తక్కువ ధరలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది అకాల వర్షాల వల్ల మొక్కజొన్న పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కోతుల బెడదతో పంటను కాపాడుకోవడంలో రైతులు తీవ్ర కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసే విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభావం దేశ ఆర్థిక విధానాలపై పడుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరిపై కూడా విమర్శలు చేశారు. తెలంగాణలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న మండలాల్లో బోనకల్ ఒకటని తెలిపారు. ఇలాంటి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించకపోతే రైతులు ఆందోళనలను మరింత తీవ్రం చేస్తారని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా రైతులందరూ పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు. రైతుల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీపీఐ ఎం జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు చింతలచెరువు కోటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు సీపీఐ ఎం మండల కార్యదర్శి కిలారు సురేష్ తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కొమ్మినేని నాగేశ్వరరావు తుళ్లూరు రమేష్ నాయకులు జొన్నలగడ్డ సునీత గుడ్డుూరి ఉమ దొండపాటి సత్యనారాయణ జోనిబోయిన గురవయ్య బంధం శ్రీనివాసరావు గుగులోత్ నరేష్ సర్పంచ్ మంద కరుణ కేతినేని నాగేశ్వరరావు గుగులోతు పంతు చలమల హరికిషన్ రావు పుచ్చకాయల వల్లరాజు ముంగి వెంకన్న కారంగుల చంద్రయ్య ఎర్రదేశి నరసింహారావు గుడ్డురి వెంకట నరసయ్య ఉన్నం వెంకటేశ్వర్లు తాత వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది

సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది పైప్ లైన్ మరమ్మతుల్లో ఆలస్యం పై ప్రజల...

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండలంలో...

రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత

రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత ఉత్సవ కమిటీలో స్థానం క‌ల్పించిన ప్ర‌భుత్వం భద్రాచలం...

వరి, మొక్కజొన్న రైతులకు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాలి

వరి, మొక్కజొన్న రైతులకు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాలి సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు...

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం : వైరా ఏసీపీ సారంగపాణి కాకతీయ,...

భద్రాద్రి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

భద్రాద్రి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిపై నిర్లక్ష్యం రూ.560 కోట్లతో...

భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్దికి భారీగా నిధులు

భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్దికి భారీగా నిధులు ముఖ్య‌మంత్రి పెద్ద మ‌న‌సుతో మంజూరు రేపు ప‌ట్ట‌ణానికి సీఎం...

రేపు సీతారాముల కల్యాణం

రేపు సీతారాముల కల్యాణం భ‌ద్రాద్రి ఆల‌యంలో స‌ర్వం సిద్ధం చేసిన యంత్రాంగం 28 ప‌ట్టువ‌స్త్రాల‌తో ఆల‌యానికి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img