వేగం కన్నా ప్రాణం మిన్న!
మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సట్ల. రాజ్ కుమార్ గౌడ్
కాకతీయ,మరిపెడ: ప్రజలు 2026 న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, వేగం కన్నా ప్రాణం మిన్న అని, మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సట్ల. రాజ్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం మరిపెడ మున్సిపాలిటీకేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వారు మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు.ఇతరులకు హాని కలిగించే పనులు ఏమి చేసినా సహించేది లేదన్నారు. హోటల్స్ ,రెస్టారెంట్స్ నిర్వాహకులుతప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. మైనర్లు వాహనాలను నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వేగం కన్నా ప్రాణం మిన్న అన్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ చైనా మంజ విక్రయిస్తే జైలు శిక్ష తప్పదన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు గాలిపటాల ఎగిరివేతకు యువత సిద్ధమవుతున్న వేళ ప్రమాదకరమైనచైనామంజా వినియోగంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. చైనా మంజ వినియోగం వలన పక్షుల మెడలు, రెక్కలు, కోసుకోవడం, ద్విచక్ర వాహనదారులకు తగిలి గాయపడటం తద్వారా ప్రాణనాష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. నిషేధిత మంజనిల్వలవిక్రయాలపైప్రత్యేకదృష్టిపెట్టామన్నారు.ప్రజలుచైనామంజాను పూర్తిగా నివారించి, ప్రభుత్వ అనుమతితో ఉన్న కాటన్ దారాలతో మాత్రమే గాలిపటాలు ఎగురవేయాలని అన్నారు. వారి వెంట ఎస్సైలు ఈ. వీరభద్రారావు, టీ. కోటేశ్వరరావు పోలీస్ సిబ్బంది ఉన్నారు.


