కాకతీయ, బయ్యారం : పచ్చని చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడితే భావితరాలకు మంచి భవిష్యత్ ను అందించిన వారమవుతామని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ యానాల వెంక రెడ్డి అన్నారు. శనివారం బయ్యారం మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో యంగ్ ఎర్త్ లీడర్స్ కార్య క్రమంలో భాగంగా గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీరు కలుషితం కాకుండా సంరక్షణ చేయాలన్నారు. ఔషధ తోటలు వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. చెట్లు మనిషి జీవన ప్రగతికి పునాదులు అని, వాటిని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దేవేంద్రచారీ, మెంటార్ టీచర్ రవీందర్ నాయక్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ జిల్లా కో ఆర్డినేటర్ మామిడి శంకరయ్య, ఫీల్డ్ కో ఆర్డినేటర్ యాకయ్య, సునీత, లక్ష్మయ్య, ధనుంజయ, రామేశ్వరరావు, లక్ష్మి నారాయణ, దస్తగిరి, సుధాకర్, .శ్రీనివాస్, శ్రీనివాస్, అరుణ శోభా కుమారి, హత్తిరామ్, రచ్చ వెంకటేశ్వర్లు, డేగం శ్రీనివాస్, విజయ, నజీమా, స్కూల్ ఎర్త్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు.


