బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిద్దాం
మన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్
కాకతీయ, వరంగల్ సిటీ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసి చివరకు 17 శాతం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ బీసీలను వంచనకు గురి చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి బీసీ ఓటర్లు బ్యాలెట్‌తో సమాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేయడానికి, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మెజారిటీ పంచాయతీలను గెలిపించుకోవాలని గంట రవికుమార్ పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మంగళవారం హసన్ పర్తి మండల పరిధిలోని జయగిరి, మడిపల్లి, ఐనవోలు మండలలోని పంతిని, నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామల సర్పంచ్, వార్డు మెంబర్లుగా అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయించారు. ఈసందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమని అన్నారు. అందుకే వరంగల్ జిల్లా బీజేపీ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. గ్రామ వార్డు మెంబర్ స్థాయి నుంచి జడ్పీటీసీ వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం నిధులను సక్రమంగా వినియోగించడం లేదని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు సూచించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను (మహాలక్ష్మి, రైతు భరోసా వంటివి) అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, పార్లమెంట్ కన్వీనర్ తాళ్ళపెల్లి కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, గడల కుమార్, రేసు శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, జిల్లా కార్యదర్శి జడ సతీష్, రాధాకృష్ణ, అధికార ప్రతినిధి మహేందర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహ రాములు, హాసన్ పర్తి మండల అధ్యక్షులు మారం తిరుపతి, తడక వినయ్, గూడూరు సందీప్, టి.అంబేద్కర్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


