కాకతీయ, నర్సింహులపేట : భవిష్యత్తు అవసరాల కోసం సౌరశక్తిని వినియోగించుకొని తెలంగాణను సౌరశక్తితో కూడిన రాష్ట్రంగా మారుద్దామని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ మహబూబాబాద్ జిల్లా మేనేజర్ రాజేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో జీపీ ఆవరణలో సోలార్ మోడల్ విలేజ్ గ్రామసభ నిర్వహించి రూప్ టాప్ సోలార్ తో విద్యుత్ సరపరా పై అవగాహన కల్పించారు. పీఎంఎస్జిఎంబివై పథకం ముఖ్యంశాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో కిన్నెరయాకయ్య, విద్యుత్ ఏఈ పాండు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ కుమార్, కారోబార్ రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.


