- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాకతీయ, మంథని : అధికారం కోసం ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బాకీకార్డును గడపగడపకు అందిస్తూ అవగాహన కల్పించారు. వంద రోజుల్లో ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చుతామంటూ 22నెలలైనా ఒక్క హమీ నెరవేర్చకుండా మోసం చేశారని అన్నారు.
పింఛన్లు, మహిళలకు రూ.2500లతో పాటు తులం బంగారం ఇలా అనేకం బాకీ పడ్డారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి గ్యారెంటీ కార్డులు ఇస్తూ ఇవి ఉంటేనే పథకాలు వర్తిస్తాయని నాయకులు ప్రచారం చేశారని, మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను బాకీ పై ప్రశ్నించాలని అన్నారు. గ్యారెంటీ కార్డులో ఉన్న పథకాలను అమలు చేయడంతో పాటు 22నెలల బాకీని తీర్చిన తర్వాతనే ఓట్ల కోసం రావాలని నిలదీయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ మాయమాటలు వింటే మరోసారి మోసం పోయి గోసపడుతామని ఆయన ప్రజలకు వివరించారు.


