- సీపీఐ (ఎంఎల్) డివిజన్ కార్యదర్శి షేర్ మధు
కాకతీయ, ఖానాపురం : పీడిత ప్రాంత, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అసువులు బాసిన అమరుల ఆశయసాధనను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి షేర్ మధు పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అమరవీరుల సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలోని మురళి స్మారక స్తూపం వద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పీడత ప్రాంత ప్రజల కోసం అనేకమంది కమ్యూనిస్టులు, విప్లవకారులు విప్లవోద్యమ నిర్మాణం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను ఉక్కు పాదంతో అణిచివేయాలనే దుందుకుడు చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విప్లవకారుల స్ఫూర్తితోనే భూమిలేని నిరుపేదలకు ఎన్నో లక్షల ఎకరాల పోడు భూములను సాధించిపెట్టిన ఘనత ఎర్రజెండాదే అన్నారు. అమరవీరులను స్మరించుకుంటూ సంస్మరణ సభలు జరపాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నారగోనీ శ్రీను, గట్ల సతీష్, గుండగాని హేమంత్, చిర్ర క్రాంతి కుమార్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.


