- సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్న
కాకతీయ, నెల్లికుదురు : పేద ప్రజల కోసం మహబూబాబాద్ శివారు ప్రాంతంలో పోలీసుల భూటకపు ఎన్కౌంటర్ లో అమరుడైన బట్టు అంజయ్య అలియాస్ సురేశన్న ఆశయాలు కొనసాగించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్నపిలుపినిచ్చారు. గురువారం నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సభ నిర్వహించారు. అందులో భాగంగా సురేషన్న స్తూపం వద్ద, అల్లేరు గ్రామంలో అమరుడు గుదే గణపతి స్తూపం వద్ద జెండాను ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతానికి కొనసాగుతున్న గోదావరిలోయ ప్రతిఘటన పోరాటంలో అనేకమంది విప్లవ వీరులు నెత్తురు చిందించారని వారికి నివాళులర్పించారు.
ఆదివాసీ, గిరిజన హక్కుల కోసం ఉద్యమించిన వీరులను ఈ నేల మరువదన్నారు. ఈ ప్రాంతంలో దొరన్న, మాధవన్న, సురేషన్న, పెద్దబోయిన సైదులు, దేశెట్టిరామచంద్రయ్య, బొమ్మన బోయిన అనసూర్య, హలావత్ సునీత, గుదే గణపతి, అశోక్ లాంటి వారు పేద ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసి రాజ్య హింసకు గురై అనారోగ్యంతో అమరులయ్యారని పేర్కొన్నారు. వారి అమరత్వం ద్వారానే ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన పేద మధ్యతరగతి ప్రజలు మూడు పూటలా అన్నం తినగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బట్టు చైతన్య, తొర్రూర్ డివిజన్ నాయకులు చిర్రా యాకన్న, చిమ్ముల కమలాకర్, ఇస్లావత్ బాలాజీ, పల్లె రమేష్, నాగవెల్లి శ్రీను రేఖ నరేష్, ఎల శ్రీకాంత్, తాళ్లపల్లి వాసు, ప్రశాంత్,సాగర్, చెన్ను, మహేష్, కొనుకుంట శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


