ఉద్యమ కారుల గోడు అసెంబ్లీ లో వినిపించండి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు
కాకతీయ తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలము అధ్యక్షుల ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు డివిజన్లో పాలకేంద్రం వద్ద మిషిన్ భగీరథ ఆఫీసులో తెలంగాణ ఉద్యమ నాయకులు ముద్దసాని వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు వాచిరెడ్డి నరసింహారెడ్డి కొండ వేంకన్న మరియు మండల అధ్యక్షులు తాళ్ల మల్లయ్య కార్యదర్శి ఏర్పుల వెంకన్న మరియు విద్యాసాగర్ మండల నాయకులు సహదేవ్ సలహాదారులు శ్యాంసుందర్ రెడ్డి మరియు సుధాకర్ గాదగాని రమేష్ మరియు వెంకటయ్య మంగళపల్లి సోమయ్య దామోదర్ తదితర నాయకుల అంతా కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఉద్యమకారులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి. విన్నవించుకొని వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. వరంగల్ ఎంపీ కావ్య సమక్షంలో ఇట్టి ఉద్యమకారులది ఆక్రందన వినిపించడం జరిగినది కావున దయచేసి మా కోరికలు నెరవేర్తానని అసెంబ్లీలో సీఎంతో చర్చించి బిల్లు పెడతారని ఈ శీతాకాలం సమావేశంలో గా ఉద్యమకారులందరికి పెన్షన్ అలాంటి చేస్తారని ఉద్యమకారులకు అన్ని విధాల ఆదుకుంటారని సమృదయంతో ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారని భావిస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగినది ముఖ్యంగా ఎమ్మెల్యే మరియు పిసిసి వైస్ ప్రెసిడెంట్ సీఎం వారితో మాట్లాడి మా ప్రయోజనం మా ప్రయోజనాలకు తెలియపరచాలనిఅన్యధా భావించకుండా మాకు మేలు చేస్తారని తొర్రూర్ డివిజన్లోని కాంగ్రెస్ నాయకులు మా వినతి పత్రాన్ని మేడమ్ కి విన్నవించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా


