కాంగ్రెస్ నాయకులపై చట్టపరమైన చర్యలు
కాకతీయ నల్లబెల్లి : సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నేతలపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. మూడేళ్ల క్రితం వచ్చిన పేపర్ కట్టింగులను వక్రీకరించి, అసత్య ప్రచారాలతో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఇది రాజకీయ విరోధత కింద కాదు, వ్యక్తిగత దౌర్జన్యంగా మారిందని బీఆర్ఎస్ మండల నాయకులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి, మాజీ జెడ్పిటిసీ పెద్ది స్వప్నలపై అసత్య ఆరోపణలు చేస్తూ, గద్దల సురేష్, చల్ల ప్రవీణ్ రెడ్డి సోషల్ మీడియాలో కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులపై చట్టపరమైన చర్యలు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


