epaper
Monday, March 2, 2026
epaper

నామినేటెడ్  ప‌ద‌వుల‌పై నేత‌ల‌ ఆశ‌లు

నామినేటెడ్  ప‌ద‌వుల‌పై నేత‌ల‌ ఆశ‌లు
ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాటి నుంచి ఎదురు చూపులు
జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి క‌మిటీల్లో చోటుకు పైర‌వీలు
ఇప్ప‌టికే ప‌లు వ్య‌వ‌సాయ‌ మార్కెట్ల‌కు చైర్మ‌న్ల నియామ‌కం
మిగిలిన‌వి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల త‌ర్వాతే నియామ‌కం
ఆశ‌లు రేపిన పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య‌లు

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : నామినేటెడ్ ప‌ద‌వుల కోసం కాంగ్రెస్ నేత‌ల నిరీక్ష‌ణ కొన‌సాగుతోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర ద‌గ్గ‌ర ప‌డుతున్నా నామినేటెడ్ ప‌ద‌వుల నియామ‌కంలో ఇంకా కొన్ని అవ‌కాశాల‌ను భ‌ర్తీ చేయ‌లేదు. ముఖ్యంగా జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి, వ్య‌వ‌సాయ‌, ఆల‌యాల చైర్మ‌న్ల ప‌ద‌వుల‌పై క‌న్నేసిన కొంత‌మంది నిర్విరామంగా త‌మ ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. అయితే పార్టీలో సీనియ‌ర్ల‌కు పెద్ద‌పీట వేయాల‌నే ఆలోచ‌న‌తో పీసీసీ నేత‌లు ఉండ‌టం, మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ త‌ర్వాత నామినేటెడ్ ప‌ద‌వుల‌పై నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని ఎమ్మెల్యేల‌కు తెలియ‌జేస్తున్నారు. దీంతో నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీపై ప్ర‌తిష్ఠంబ‌న కొన‌సాగుతోంది. ఏళ్లుగా పార్టీలో ప‌నిచేశాం.. అయినా స‌రైన గుర్తింపు ద‌క్క‌డం లేద‌న్న నైరాశ్యం కొంత‌మంది నేత‌ల్లో క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

స్థానిక ఎన్నిక‌ల త‌ర్వాత నియామ‌కాలు..?!

త్వరలోనే స్థానిక సంస్థల పోరు పూర్తి కానుంది. దీని త‌ర్వాత‌ ప్రభుత్వం ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్‌ పదవులపైనా చాలా మంది కన్నేశారు. ఇప్పటి నుంచే జోరుగా నమ్మకంతో నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేప‌థ్యంలో నామినేటెడ్ ప‌ద‌వుల్లో మిగిలిన వారికి ఇచ్చే చాన్స్ ఉంద‌న్న చ‌ర్చా జ‌రుగుతోంది. దీనికి తోడు పార్టీలో ప‌దేళ్లకు పైబ‌డి ప‌నిచేసే వాళ్ల‌కు ముందు ప్రియారిటీ ఇవ్వాల‌నే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్చార్జి న‌ట‌రాజ్ మీన‌న్ తెలిపిన నేప‌థ్యంలో డీసీసీల వ‌ద్ద నుంచి నాయ‌కుల జాబితాలు కూడా వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల‌న్నీ కూడా నామినేటెడ్ ప‌ద‌వుల‌ను సీనియ‌ర్ల‌కే అన్న‌ట్లుగా సుస్ప‌ష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వాన్ని క్షేత్ర‌స్థాయిలో ప్ర‌ద‌ర్శించిన నేత‌ల‌కే అవ‌కాశాలు క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా ప‌ద‌వుల‌పై ఆశ‌లు

వాస్త‌వానికి నామినేటెడ్ ప‌ద‌వుల్లో మార్కెట్ల చైర్మ‌న్లు, డైరెక్ట‌ర్లు, ఆల‌యాల క‌మిటీలతో పాటు మ‌రికొన్ని నియోజ‌క‌ర్గ‌, జిల్లా స్థాయి నామినేటెడ్ ప‌ద‌వులున్నాయి. ఇందులో మార్కెట్లు, ఆల‌యాల క‌మిటీ చైర్మ‌న్లు, డైరెక్ట‌ర్ల ప‌ద‌వుల‌కు ఎక్కువ‌గా డిమాండ్ ఉంది. ఈ ప‌ద‌వుల‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆశ‌వ‌హులకు లింక్ చేసే ప‌రిస్థితి కనిపిస్తోంది. ఈనేప‌థ్యంలోనే అనేక ఆల‌యాలు, కొన్ని మార్కెట్ పాల‌క వ‌ర్గాల క‌మిటీలు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ లో పెండింగ్‌లో ఉండ‌టం.. ఆ వాద‌న‌కు బ‌లం చేకూర్చిన‌ట్ల‌వుతోంది. అందుకే దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు పాలకవర్గాల్లో నియామకాల ప్రక్రియలో ఎలాంటి చలనం లేకుండా పోయింది. దీనంతటికీ మంత్రివర్గ కూర్పు లేకపోవడమే కారణమని తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాతే నామినెటెడ్‌ పదవుల భర్తీ ఉంటుందనేది కీలక నేతలు చెబుతుండడంతో ద్వితీయ శ్రేణి నాయకులు అభిప్రాయంతో ఉండ‌టం గ‌మ‌నార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img