రజక సంఘం ఆధ్వర్యంలో నేతలకు సత్కారం
కాకతీయ కరీంనగర్/గోదాంగడ్డ : కరీంనగర్ నగరంలోని గోదాంగడ్డలో రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ మేయర్ వై. సునీల్ రావును సంఘం సభ్యులు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజలకు సేవ చేసే దిశగా ఆయన చేపడుతున్న కార్యక్రమాలను సంఘం ప్రతినిధులు ప్రశంసించారు.
అదేవిధంగా, మున్సిపల్ కార్పొరేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన పొన్నం లక్ష్మి–మొండయ్య దంపతులను కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంఘం నాయకులు కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ నగర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. రజక సంఘం అభ్యున్నతికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో రజక సంఘం పెద్దలు, యువకులు, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


