సర్పంచ్‌గా న్యాయవాది కనకయ్య…
బార్ అసోసియేషన్ ఘన సన్మానం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చర్లపల్లి(ఆర్) గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన అడ్వకేట్ ఎట్టెపు కనకయ్యను కరీంనగర్ బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి కందుల అరుణ్ కుమార్‌తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొని కనకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎట్టెపు కనకయ్య మాట్లాడుతూ, తనను సన్మానించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్‌తో పాటు న్యాయవాదులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


