epaper
Sunday, March 1, 2026
epaper

అత్తాపూర్‌లో లాయర్ దారుణ హత్య

అత్తాపూర్‌లో లాయర్ దారుణ హత్య
కార్యాలయంలోనే కత్తులతో దాడి చేసి హత్య
మొదటి భార్య తమ్ముళ్లపై పోలీసుల అనుమానం
ఘటనాస్థలంలోనే మృతి చెందిన అడ్వొకేట్ ఖదీర్
సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు

కాకతీయ, రంగారెడ్డి : హైదరాబాద్ అత్తాపూర్‌లో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సులేమాన్‌నగర్‌లోని తన సొంత కార్యాలయంలో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు లోపలికి చొరబడి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఖదీర్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ కలహాలే కారణమా?
ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖదీర్ మొదటి భార్య తమ్ముళ్లు (బావమరుదులు) ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాలే హత్యకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మొయినాబాద్‌లో మరో న్యాయవాది హత్య జరిగిన నేపథ్యంలో ఈ ఘటన నగరంలో మరింత ఆందోళనకు గురిచేసింది. న్యాయవాదిపై జరిగిన ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘ‌నంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

ఘ‌నంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి : గౌతమ్ నగర్...

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి: మల్కాజిగిరిలోని ప్రభుత్వ డిగ్రీ...

మద్యం దుకాణాన్ని తొల‌గించాల‌ని మహిళల ఆందోళన

మద్యం దుకాణాన్ని తొల‌గించాల‌ని మహిళల ఆందోళన ఎక్సైజ్ శాఖకు మహిళా సంఘాల ఫిర్యాదు కాకతీయ,...

బీజేపీ అండ‌తో అలియాబాద్ కాంగ్రెస్ కైవ‌సం

బీజేపీ అండ‌తో అలియాబాద్ కాంగ్రెస్ కైవ‌సం హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు బీజేపీ మ‌ద్ద‌తు చైర్‌పర్సన్‌గా...

స్వప్న హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం!

స్వప్న హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం! ఫిర్యాదులిచ్చినా పట్టించుకోని పోలీసులు హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగిన...

ఏకశిలా నగర్‌లో భూదందా

ఏకశిలా నగర్‌లో భూదందా ల్యాండ్ మాఫియా–అధికారుల కుమ్మక్క‌య్యారు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం నేను...

ప్రేమ పెళ్లి.. చివరకు వరకట్న హత్య!

ప్రేమ పెళ్లి.. చివరకు వరకట్న హత్య! అదనపు కట్నం కాటుకు యువతి బలి తాండూరులో...

*చేవెళ్ల ప్ర‌మాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య‌*

*చేవెళ్ల ప్ర‌మాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య‌* *ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రో న‌లుగురు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img