కాకతీయ, వరంగల్ బ్యూరో : కాకతీయ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగింది. ఐదు సంవత్సరాల లా కోర్సు రెగ్యులరైజేషన్‌తో పాటు హాస్టల్ వసతి, బస్ సౌకర్యం, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకం, బార్ కౌన్సిల్ ఫీజు రద్దు తదితర డిమాండ్లతో విద్యార్థులు 12న ఉదయం 11 గంటల నుండి ర్యాలీగా బయలుదేరి, విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ఎదుట నిరసన బైఠాయించారు.
రాత్రి వరకు నిరసన కొనసాగించిన విద్యార్థులు, రిజిస్ట్రార్ ఆచార్య కట్ల రాజేందర్, ఇతర విశ్వవిద్యాలయ అధికారులు హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా విరమించారు. శనివారం మళ్లీ విద్యార్థులు ధర్నా చేపట్టగా, రిజిస్ట్రార్ ఆచార్య వల్లూరి రామచంద్రం విద్యార్థుల సమస్యలను విని పలు హామీలు ఇచ్చారు. మొదటి సంవత్సరం గర్ల్స్‌కు హాస్టల్ వసతి, పరీక్షలకు సెల్ఫ్ సెంటర్, సుబేదారి లా కళాశాల వరకు బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థుల నుండి వసూలు చేస్తున్న బార్ కౌన్సిల్ ఫీజులు రద్దు చేయనున్నట్లు తెలిపారు. అయితే, బాయ్స్ హాస్టల్ వసతి, ఐదు సంవత్సరాల లా కోర్సు రెగ్యులరైజేషన్, కళాశాలకు రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకం వంటి కీలక సమస్యలపై తుది నిర్ణయం తీసుకోవడానికి వీసీ సమక్షంలో రెండోదఫా చర్చలు జరగాల్సి ఉందని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో విద్యార్థి నాయకులు స్టాలిన్, రాకేష్ రెడ్డి, సంధ్య, కావ్య, అశ్విత, ప్రవళిక, సింధు, వైష్ణవి, అరుణ్, సందీప్, అట్ల రాజు, పవన్, కార్తీక్, యోగేష్, దుర్గేష్, శ్వేతాంజలి, తేజస్వి, ఏక్తా జాదవ్, రాజిని, నవిత, ప్రభలిక, సుష్మిత, భవాని, సాయి కీర్తన, జీతన్, సాయి ప్రదీప్, శివాజీ, గణేష్, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.


