నూతన ట్రాన్స్ఫార్మర్ల ప్రారంభం
లో-వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు
కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. 10వ, 26వ వార్డుల్లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను శనివారం మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి సహకారం అందించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గృహ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ కూడా అధికమవుతోందన్నారు. పాత ట్రాన్స్ఫార్మర్లపై భారం పెరగడంతో లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని నివారించేందుకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, కౌన్సిలర్లు హనుమకొండ శ్రీధర్, మండల శ్రీదేవి శ్రీనివాస్, పొన్నాల మనిషా ప్రకాష్, బాణాల ప్రసన్న శ్రీనివాస్, శ్రీరామోజు రోజారాణి, ఇస్లావత్ రామ గోపి, వేల్పుల శ్రీలతతో పాటు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


