సగరులకు భూమి కేటాయించాలి
మంత్రి పొన్నంకు వినతి
కలెక్టర్‌కు సిఫార్సు చేసిన పొన్నం ప్రభాకర్
కాకతీయ, జమ్మికుంట /వీణవంక : కరీంనగర్ జిల్లా కేంద్రంలో సగరుల కోసం భూమి కేటాయించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సగర సంఘం ప్రతినిధులు కోరారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సగరుల సమస్యలు, వారి సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో చర్చించారు. సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి, భూమి కేటాయింపుపై సానుకూలంగా స్పందిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేసినట్లు తెలిపారు.సగరుల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


