భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
సీపీఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు
కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని వివిధ గ్రామాలలో భూముల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు అన్నారు. సోమవారంనెల్లికుదురులో తహసీల్దారు సీహెచ్ నరేష్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా గతంలో భూభారతిలో పెట్టుకున్న భూ సమస్యల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వివిధ గ్రామాలలో ప్రభుత్వ భూములు అక్రమనకు గురవు తున్నాయని ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు గతంలో విన్నవించినా పట్టించుకోవడంలో జాప్యం జరిగిందన్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూములకు హద్దులు నిర్వహించి భూములు కాపాడాలని విన్నవించారు. అదేవిధంగా ప్రభుత్వ భూములలో బోర్డులు సైతం ఏర్పాటు చేయాలని అన్నారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళన పోరాట నిర్వహిస్తామని డిమాండ్ చేశారు.


