కాకతీయ పెద్దపల్లి: భూ భారతి క్రింద వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్ తహసిల్దార్ కార్యాలయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులను సిద్దం చేసి పెట్టుకొవాలని, ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
భూ భారతి పోర్టల్ కింద భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వివిధ రకాల దరఖాస్తులు త్వరగా పరిష్కారం చేయాలని, అసైన్మెంట్ భూములకు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హుల జాబితా సిద్ధం చేయాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దార్ బషిరుద్దిన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.


