మైక్ సెట్ ను బహూకరించిన లాలతాండ సర్పంచ్
కాకతీయ, ఇనుగుర్తి : మండలంలోని లాలు తండా చెందిన గ్రామ సర్పంచ్ భూక్య లక్ష్మీ వెంకన్న నాయక్ 77వ గణ తంత్ర దినోత్సవా న్నీ పురస్కరించుకొని స్థానిక ఎంపీపీ ఎస్ లాలు తండా పాఠశాలకీ 7 వేల రూపాయల విలువైన సౌండ్ సిస్టం అను సోమవారం బహుకరించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ విద్య స్కూల్ అభివృద్ధికి ఎలాంటి సహాయం కావాలన్నా మునుముందు అనేక కార్యక్రమాలలో పాల్గొంటామని అన్నారు. ఉపాధ్యాయుల అంకిత భావం, విద్యార్థుల అభివృద్ధి ని గమనించిన సర్పంచ్ లక్ష్మి వెంకన్న విద్యార్థులను ఉపాధ్యాయులను ప్రోత్సహించి మైక్ సెట్ బహుకరించినందులకు ప్రధానోపాధ్యాయులు బోరిగం రాములు ,వేణు, విద్యార్థులు సర్పంచ్ కీ ధన్యవాదములు తెలియచేసారు.


