కాకతీయ,మంచిర్యాల జిల్లా: రెవిన్యూ అధికారులు సమయ పాలన పాటించడం లేదు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల రెవెన్యూ కార్యాలయం సమయం ఉదయం 10:50 అయినప్పటికీ గదుల తాళాలు తీయకపోవడం వీరి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. కార్యాలయానికి వచ్చిన ప్రజలు అధికారుల కోసం వేచి ఉంటున్నారు. ఈ విషయం పై తహశీల్దార్ కు చరవాణీ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేస్తే తహశీల్దార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇదీలా ఉండగా పది నిమిషాలు లేట్ అయితే మునిగిపోయేదేముందని ఓ ఉద్యోగి అనడం వీరి నిర్లక్ష్యానికి నిదర్శనం.


