బార్ కౌన్సిల్ ఎన్నికల అధికారి గా లక్కినేని నియామకం
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఈ నెల 30వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ పరిధిలో నిర్వహించనున్న ఎన్నికలకు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణను ఎన్నికల అధికారిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేసింది. లక్కినేని సత్యనారాయణ గతంలో 2018లో జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికలను ఎన్నికల అధికారిగా విజయవంతంగా నిర్వహించిన అనుభవం కలిగి ఉన్నారు. ఎన్నికల నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం, నిష్పక్షపాతత్వం, పారదర్శకతపై బార్ కౌన్సిల్‌కు ఉన్న విశ్వాసంతోనే మరోసారి ఈ బాధ్యతను అప్పగించినట్లు కౌన్సిల్ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల్లో హర్షం వ్యక్తమైంది. లక్కినేని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగుతాయనే నమ్మకాన్ని పలువురు న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నారు.


