కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా వంగపహాడ్ గ్రామంలో విద్యుదాఘాతంతో విషాద ఘటన చోటుచేసుకుంది. పెరడు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి కూలీకి వెళ్లిన రాజు దుర్మరణం చెందాడు. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి బంధువులు, పొలం యజమాని ఇంటి ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ పరంగా సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని వారికి సర్దిచెప్పారు.


