నూతన ఏఈగా కుంట శ్రీధర్
కాకతీయ, రాయపర్తి : మండల విద్యుత్ శాఖ నూతన అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)గా కుంట శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. శనివారం మండల కేంద్రంలోని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) నటరాజన్ సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ ఏఈగా విధులు నిర్వహించిన పెద్ది రవళి సెలవుపై వెళ్లారు. ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని ఏఈ శ్రీధర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంగెం ఏఈ అశ్విన్, సబ్ ఇంజనీర్ తాజుద్దీన్, విక్రమ్, ఎస్ఎల్ఐ రాజయ్య, ఎల్ఐ కిషన్, లైన్మెన్ వెంకన్న, ప్రభాకర్, రవీందర్, భీమ, ఎనగందుల ప్రవీణ్, జంపాల మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


