రామలింగేశ్వరాలయంలో కుంకుమార్చన
కాకతీయ, నెక్కొండ : నెక్కొండ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొలువుదీరిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవి సహిత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బీవీఎన్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి. కార్యక్రమంలో రామలింగేశ్వర సేవా సమితి ప్రతినిధులు డింగరి శేష పవన్ కుమారాచార్యులు, వేద జ్యోతిష పండితులు బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ శాస్త్రి పాల్గొన్నారు. అలాగే మహిళా ప్రతినిధులు గన్ను పద్మలత, గన్ను రజనీ, దొడ్డ కవిత, నంగునూరి శైలజ, సంగీత సుధ, ముడిదేని శ్రీలత, బొల్లం రాధిక, గుమ్మడవెల్లి స్వరూప, తవిడిశెట్టి సంధ్య, విజయ, కీర్తన, శ్రీలక్ష్మి, చంద్రకళ, మేఘ తదితరులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.
ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కుంకుమార్చన కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో భక్తిమయ వాతావరణాన్ని సృష్టించిందని భక్తులు తెలిపారు.


