కాకతీయ, ములుగు ప్రతినిధి: జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్న పారిశుధ్య కార్మికుడు మైదం మహేష్ కుటుంబానికి మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ములుగు బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణ బాబు, స్థానిక నాయకులు కలిసి మైదం మహేష్ భార్యా పిల్లలకు ఈ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి చేయూత ఇవ్వలేదని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కేటీఆర్ మాట ఇచ్చి వారం రోజుల్లోనే ఆర్థిక సహాయాన్ని అందజేయడం గొప్ప విషయం అని అన్నారు. స్థానిక ప్రజలు, బిఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


