కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో రాష్ట్రంలోని పలు జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు.దీనికి సంబంధించి ఎర్రవల్లి ఫాంహౌజ్ లో పార్టీ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్ధితుల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ కు కేసీఆర్ సూచినట్లు సమాచారం. కవితను సస్పెండ్ చేయడంతో పార్టీ క్యాడర్ లో నెలకున్న గందరగోళానికి తెరదించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ముఖ్యంగా టార్గెట్ చేయాలని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.ఈనెల 10న కొత్తగూడెం, 11న భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ టూర్ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 13న గద్వాల్ నియోజకవర్గంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని కేటీఆర్ భావిస్తున్నారట. దసరాలోపు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కేటీఆర్ ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం.


