కేటీఆర్ బక్వాస్..
ఆయన మాటలు నమ్మొద్దు
వచ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు
నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి
జూబ్లీహిల్స్ అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్యం
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని .. నవీన్‌ను గెలిపిస్తే.. ఇంటి మనిషిని గెలిపించినట్టు.. ప్రతిపక్షంను గెలిపిస్తే పాలొన్ని గెలిపించినట్టు అని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ఇంటి మనిషిని గెలిపిస్తే.. బెడ్ రూంలోకి వెళ్ళి కూడా పని చేయించుకోవచ్చు. పాలోనికి ఓటు వేస్తే… ఇంటి బయటే ఉండి అడగాల్సి ఉంటది. మూడేళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీనే.. నవీన్ యాదవ్ ను గెలిపించి అభివృద్ధి చేసుకోండి. నవీన్ యాదవ్ గుర్రం లాగా పరిగెత్తే యువకుడు..సామాజిక స్పృహ ఉన్న నాయకుడు.. అని జగ్గారెడ్డి అన్నారు. మూడేళ్లు కాదు.. మళ్ళీ ఐదేళ్లు మేమే అధికారంలో ఉంటామని జగ్గారెడ్డి అన్నారు. జూబ్లిహిల్స్ ఓటర్లు… నవీన్ యాదవ్ యువకుడికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని
విజ్ఞప్తిచేశారు.
పట్టువిడవకుండా రాజకీయ పోరాటం ..
పట్టువిడవకుండా రాజకీయ పోరాటం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ కి గెలిపిస్తే మూడేళ్లు జూబ్లీహిల్స్ అభివృద్ధి జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ ని గెలిపిస్తారని నమ్మకం ఉంది. బీజేపీ టీఆర్ఎస్ అభ్యర్థుల కంటే నవీన్ యాదవ్ వంద రెట్లు బెటర్. నవీన్ యాదవ్ గెలిస్తే రోజు సీఎం వెంట తిరిగి పనులు చేయిస్తారు. ప్రతిపక్షానికి అవకాశం ఇస్తే… జూబ్లీహిల్స్ కి ఏం పని చేయలేరూ. సీఎం రేవంత్ రెడ్డి మాట గౌరవిస్తే.. మరింత ఉత్సాహంతో పనిచేస్తారూ. అధికార పార్టీని గెలిపిస్తే ఇంటివాన్ని గెలిపించినట్టు.. అని జగ్గారెడ్డి అన్నారు. మంత్రులంతా జవాబుదారీగా పనిచేస్తారు. కొల్లూరు లో డబుల్ బెడ్ రూమ్ లలో నివసించే వాళ్లకు రేషన్ షాప్ లు లేవు.. కానీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే.. రేషన్ షాపులు ఏర్పాటు అయ్యాయి. కేటీఆర్ బక్వాస్ మాటలు నమ్మకండి.. ఆయన అవసరాల కోసం కాదు.. ప్రజలు మీ అవసరాల కోసం చూడండి.. అని జగ్గారెడ్డి అన్నారు.


