epaper
Tuesday, April 7, 2026
epaper

కోటపాటి రుక్మారావుకు “దళితరత్న” అవార్డు

కోటపాటి రుక్మారావుకు “దళితరత్న” అవార్డు
విద్యాభివృద్ధి, సామాజిక సేవకు గుర్తింపు
రవీంద్రభారతిలో ఘ‌న స‌న్మానం

కాకతీయ, ఖమ్మం : వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కోటపాటి రుక్మారావుకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మరియు బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ ద‌ళిత‌ర‌త్న అవార్డు బ‌హూక‌రించింది. సామాజిక సేవ‌కు కృషి చేస్తున్న కోట‌పాటి రుక్మారావులాంటి వ్య‌క్తులకు ఇలాంటి అవార్డులు అంద‌జేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ సి. శ్రీధర్ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మరియు బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. విద్యాభివృద్ధి, సామాజిక సేవలో విశేష కృషి చేసిన కోటపాటి రుక్మారావును సత్కరించారు. ఈసంద‌ర్భంగా దొమ్మాటి సుదర్శన్ బాబు మాట్లాడుతూ కోటపాటి రుక్మారావు గత 15 సంవత్సరాలుగా దళితుల విద్యాభివృద్ధి, హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, సామాజిక అవగాహన కార్యక్రమాలు, యువతకు మార్గనిర్దేశం వంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సమాజానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించిందన్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం కోటపాటి రుక్మారావు మాట్లాడుతూ ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను కలిగించిందన్నారు. హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, సమాజ సేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగుతానన్నారు. సమ సమాజ స్థాపన కోసం కృషి చేస్తానన్నారు. పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో సేవ కొనసాగిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ బి. శ్రీనివాస రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ పి. శ్రీనివాస రావు, సూపరింటెండెంట్లు అలీముద్దీన్, బాలసానిరెడ్డి, ఏ ఎస్ సి డి ఓ మోహన్, కళ్యాణ్, అల్లిబిల్లి మహేందర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య, కరెన్సీ పై బీఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ జెర్రిపోతుల పరుశురాం, పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ వర్గాల నుంచి కోటపాటి రుక్మారావుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భద్రాచలం నియోజకవర్గ కో ఆర్డినేట‌ర్‌గా గాజర్ల

భద్రాచలం నియోజకవర్గ కో ఆర్డినేట‌ర్‌గా గాజర్ల బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై టీపీసీసీ...

ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై విచారణకు ఆదేశాలు

ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై విచారణకు ఆదేశాలు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం...

గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ వితరణ

గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ వితరణ అందించిన కూసుమంచి వర్తక సంఘం కాకతీయ , కూసుమంచి...

అక్రమ కలప రవాణాపై దాడి

అక్రమ కలప రవాణాపై దాడి మామిడి కర్రల లోడ్‌ లారీ స్వాధీనం.. కేసు...

అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ

అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ కార్యకర్తల నిస్వార్థ త్యాగమే పార్టీ బలగం బీజేపీ జిల్లా...

గాలికుంటు నివారణకు టీకాలు తప్పనిసరి

గాలికుంటు నివారణకు టీకాలు తప్పనిసరి మండల పశు వైద్యాధికారి డాక్టర్ అన్వేష్ కాకతీయ, బోనకల్...

విద్యార్థుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి

విద్యార్థుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి బెస్ట్ అవైలబుల్ పథకం నిధులు ఆలస్యం కాకతీయ,...

మంత్రి మాటకు విలువేది..?!

మంత్రి మాటకు విలువేది..?! కలెక్టర్ సార్‌ ఆదేశాలు అమలెక్క‌డా? ప‌ట్ట‌ణ ప్ర‌కృతిపై జ‌రిగిన విచార‌ణ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img