కాకతీయ, తెలంగాణ బ్యూరో: KCR, కేటీఆర్ వల్లే BRS నుంచి నేతలు బయటకు వచ్చారని సంచలన కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ కొండవిశ్వేశ్వర్ రెడ్డి.కవిత చెప్పినట్టుగా హరీష్‌రావు వల్ల పార్టీ వీడలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ అహంకారం, అవినీతి వల్లే..తాను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్లు స్పష్టం చేశారు. కవిత ఏం తెలియని అమాయకురాలి మాట్లాడుతున్నారు.
కవిత అవినీతి చేయలేదా అని ప్రశ్నించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక్క రాష్ట్రాన్ని రూల్ చేసిందన్నారు. కాళేశ్వరం అవినీతి జరిగిందే కేసీఆర్ వల్ల అన్నారు. హరీశ్ రావును కేవలం సంతకాల వరకే పరిమితం చేశారన్న కొండవిశ్వేశ్వర్ రెడ్డి..కవితను బీజేపీ వైపు కూడా చూడనివ్వమన్నారు.
కాగా కవిత పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు కారణంగానే జగ్గారెడ్డి, చెరుకు సుధాకర్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, విజయరామారావు వంటి వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోయారంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


