- తెలంగాణకు తొలితరం ఉద్యమకారుడు
- ఘనంగా 110 వ జయంతి వేడుకలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిది. స్వాతంత్ర్య సమ
ర యోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమ కారుడు, గాంధేయ వాదిగా రాష్ట్రంలో గుర్తింపు పొందారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శనివారం రోజున బాపూజీ కృషిని స్మరించుకుంటూ వరంగల్ జిల్లా యంత్రాంగం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కొత్తవాడ జంక్షన్ లో..
తెలంగాణ ఉద్యమం లో చురుకైన పాత్ర పోషించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతిని
పురస్కరించుకొని జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ కొత్త వాడ జంక్షన్ వద్ద గల బాపూజీ విగ్రహానికి జిల్లా అనదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిబిసిడిఓ పుష్పలత, అధికారులు, తెలంగాణ పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్, ఎలగం సత్యనారాయణ, చిన్న కొమురయ్య, శామంతుల శ్రీనివాస్, బాసాని శ్రీనివాస్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
వరంగల్ బల్దియా కార్యాలయంలో..
దివంగత మాజీ మంత్రి స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ 110 జయంతిని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొని ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కమిషనర్ చంద్రశేఖర్ సి ఎం హెచ్ ఓ డా.రాజారెడ్డి సి హెచ్ ఓ రమేష్ ఇంచార్జి ఎస్ ఈ,సిటీ ప్లానర్ లు మహేందర్ రవీందర్ రాడేకర్ అకౌంట్స్ అధికారి శివ లింగం డిప్యూటీ కమిషనర్ లు రవీందర్ సమ్మయ్య హెచ్ ఓ లక్ష్మారెడ్డి ఏం హెచ్ ఓ డా.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మామునూరు బెటాలియన్ లో..
మామునూరు పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో కొండా లక్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ, డీఎస్పీ లు బిక్షపతి, వెంకటేశ్వర రావు, రవీందర్, సోమాని, ఏవో కల్పన రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ లు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.


